6 Unknown Facts About India

 India Real Truths
Hai Friends
Welcome to Back Bench Genius
i am .......
ఈరోజు నేను ఒక interesting fact తో మీ ముందుకు వచ్చాను
మన దేశం గురించి కొన్ని తెలియని వాస్తవాలను తెలుసుకుందాం

 • తేలియాడే పోస్టాఫీస్

ప్రపంచంలోనే అతిపెద్ద పోస్టల్ నెట్వర్క్ మన దేశానికే సొంతం. దేశ వ్యాప్తంగా 1,55,015 పోస్టాఫీసులు ఉండగా.. ఒక్కొక్క పోస్టాఫీసు సగటున 7,175 మంది కోసం పనిచేస్తోంది. శ్రీనగర్ (J& K)లోని దాల్ సరస్సులో తేలియాడే పోస్టాఫీసు ఉంది. 2011 ఆగస్టులో దీనిని ప్రారంభించగా.. ప్రపంచంలోనే తేలియాడే పోస్టాఫీసు ఇదొక్కటే

 • ప్రపంచంలోనే అత్యధిక ఎత్తైన క్రికెట్ గ్రౌండ్

ప్రపంచంలో అతి ఎత్తైన క్రికెట్ గ్రౌండ్ కూడా మనదేశంలోనే ఉంది. హిమాచల్ ప్రదేశ్ లోని చైల్ లో ఉన్న క్రికెట్ గ్రౌండ్ భూమి నుంచి 2,444 మీటర్ల ఎత్తులో ఉండగా.. 1893 లో చైల్ మిలిటరీ స్కూల్ ఆధ్వర్యంలో దీనిని నిర్మించారు

 • చంద్రునిపై నీరు

చంద్రుడిపై నీరు ఉన్నట్లు ప్రపంచంలో మనదేశమే ముందుగా గుర్తించింది. 2009 సెప్టెంబర్ లో చంద్రయాన్-1 ను ప్రయోగించడం ద్వారా ఇస్రో ఈ విషయాన్ని గుర్తించింది.

 • 2వ అతిపెద్ద ఇంగ్లీష్ మాట్లాడే దేశం

ప్రపంచంలోనే ఇంగ్లీష్ మాట్లాడే 2వ అతిపెద్ద దేశం కూడా మనదే. మన దేశంలో 12.5 కోట్ల మంది ఇంగ్లీష్ మాట్లాడేవారు ఉండగా.. దేశ జనాభాలో ఇది కేవలం 10 శాతం మాత్రమే. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది

 • నేషనల్ డ్రింక్ ఆఫ్ ఇండియా

మసాలా చాయ్ భారత్ లో 5 వేల సంవత్సరాల క్రితం నుంచే ఉంది. మన మసాలా చాయ్ లోని టీ ఆకులు, మసాలాకు చాలా పెద్ద చరిత్రే ఉంది. మన దేశ ప్రజలు ఏడాదికి 8,37,000 టన్నుల టీ తాగుతారు

 • అత్యధిక శాఖాహారులు

కొన్ని మతపరమైన, ఇతర కారణాలతో దేశంలో 20-40 శాతం మంది శాఖాహారులే ఉన్నారు దీంతో ప్రపంచంలోనే అత్యధిక శాఖాహారులున్న దేశంగా కూడా భారత్ నిలిచింది

                                          See this Video For More Information


 

Comments