Top 6 Most Scareing Roads

 Top 6 Most Scareing Roads
Hai Friends
Welcome to Back Bench Genius


ప్రపంచంలోనే మన దేశంలో చాలా ప్రమాదకరమైన రోడ్లు ఉన్నాయి.ఈ రోడ్లలో ప్రయాణం సాహసోపేతంతో పాటు చాలా భయానకంగా ఉంటుంది. అలాంటి రోడ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం

 • కొలి హిల్ రోడ్

తమిళనాడులో ఉన్న కొల్లి హిల్ రోడ్డు చాలా మలుపులు తిరిగి ఉంటుంది అంటే ఈ రోడ్డుపై ఉండే మలుపుల్లో వాహనాలు 180 డిగ్రీల వరకూ మలుపు తిరగాల్సి ఉంటుంది అందుకే ఈ రోడ్డును మౌంటెన్ ఆఫ్ డెత్ అని
పిలుస్తారు ఇక్కడ ప్రసిద్ధ ఆగయా గంగై జలపాతంతో పాటు శివుడి దేవాలయం ఉన్నాయి

 • త్రీ లెవల్ జిగ్ జాగ్ రోడ్డు

సిక్కింలోని త్రీ లెవల్ జిగ్ జాగ్ రోడ్డు ప్రపంచంలోనే చాలా ప్రమాదకరమైనది. ఈ రోడ్డుపై దాదాపు 100కు పైగా మలుపులు ఉంటాయి. 30కి.మీ దూరంలోనే 100 మలుపులు ఉండగా.. ఈ రోడ్డుపై ప్రయాణించేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. భూమి నుంచి 11,200 అడుగుల ఎత్తులో ఈ రోడ్డు ఉంటుంది

 • కిల్లర్-కిష్ట్వార్ రోడ్డు

హిమాచల్ ప్రదేశ్ లోని చంబ జిల్లా కిల్లర్ ను జమ్మూకాశ్మీర్లోని కిష్టయార్ ను కలుపుతూ ఈ రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డుపై ఒక్క వాహనం మాత్రమే వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ లోని పాంగి లోయను చూడాలంటే ఈ రోడ్డుపై వెళ్లక తప్పదు. ఒకవైపు కొండలు, మరోవైపు వెయ్యి అడుగుల లోతులో చంద్రభాగ నది ఉంటుంది కొండ చరియలు ఎక్కువగా విరిగిపడే రోడ్లలో ఇదొకటి

 • లేహ్-మనాలి హైవే

ఇది సాధారణ రోడ్డు కాదు. ధూళి-కంకరతో ఉండే ఈ రోడ్డు మీద ప్రయాణిస్తూ లాహాల్ & స్పితి జిల్లాకు ఈ చెందిన ఎన్నో అద్భుతమైన లోయలను చూడవచ్చు. 479కి.మీ పొడవుంటే ఈ హైవేపై ప్రయాణం కొన్ని సవాళ్లతో కూడుకున్నది. అక్కడక్కడ కొండచరియలు విరిగిపడుతుంటే ఈ హైవేపై వెళ్లడానికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి

 • పూణె-ముంబై ఎక్స్ ప్రెస్

పూణె-ముంబై ఎక్స్ ప్రెస్ వే డ్రైవింగ్ చేయడానికి సరైన రోడ్డు. రోడ్డు ఎంత బాగుంటుందో.. ప్రమాదాలు కూడా అదేస్థాయిలో జరుగుతాయి. 94 కి.మీ దూరం ఉండే ఈ హైవేపై 2010 నుంచి 2015 వరకు 4,234 ప్రమాదాలు జరిగితే.. 1,323 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 51 మంది చనిపోయారు

 • నేషనల్ హైవే 22

దేశంలోని జాతీయ రహదారుల్లో నేషనల్ హైవే 22 అత్యంత ప్రమాదకరమైనది. బీహార్లోని సోన్బర్సా నుంచి జార్ఖండ్ లోని చాందవాను కలుపుతూ ఉన్న ఈ రహదారి మొత్తం శిఖరాలు, సొరంగాలే ఉంటాయి. ఈ రోడ్డు గురించి పలు ఛానెళ్లలో 'ఘోరమైన రోడ్లు' అనే కథనాలు కూడా వచ్చాయి

                                        See this Video For More Information


 

Comments